మీరు స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారా?

Sat,January 12, 2019 06:13 AM

scholarship will be provided only when applicant submits hard copies say officers

హైదరాబాద్: జిల్లాలో స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారు తప్పనిసరిగా ఆయా దరఖాస్తులను తమకు పంపించాలని, ఇలా చేసిన వారికే మంజూరు చేస్తామని ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ డీడీ జాటోతు రామారావు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు సమర్పించని విద్యార్థుల దరఖాస్తులను ఆయా కాలేజీ ప్రిన్సిపాళ్లు చొరవ తీసుకుని, ఎప్పటికప్పుడు తమకు సమర్పించాలని సూచించారు. స్కాలర్‌షిప్ దరఖాస్తుల హార్డ్ కాపీలను సమర్పించకుంటే వారికి మంజూరు చేయకుండా, పెండింగ్‌లో పెడుతామని స్పష్టం చేశారు.

ప్రింట్ దరఖాస్తులు అందినవి 70 శాతమే
మీరు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఆ ఆన్‌లైన్ దరఖాస్తును ప్రింట్ తీసుకుని దానికి సరైన ధ్రువపత్రాలను జతచేసి కాలేజీలో ప్రిన్సిపాళ్లకు అందజేయండి. వాటిని సంక్షేమ శాఖలకు ప్రిన్సిపాళ్లు పంపించాలి. ఇలా పంపిస్తేనే స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లను మంజూరు చేస్తామని, లేదంటే పెండింగ్‌లో పెడుతామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనున్నది. అయితే ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో 70 శాతం మాత్రమే ప్రింట్ తీసిన దరఖాస్తులను సంక్షేమ శాఖాధికారులకు సమర్పించారని, మరో 30శాతం ఇప్పటి వరకు సమర్పించలేదన్నారు. స్కాలర్‌షిప్‌ల మంజూరు ప్రక్రియ ప్రకారం.. ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రింట్ తీసుకుని కాలేజీ ప్రిన్సిపాళ్లకు సమర్పించాలి. వాళ్లు అప్రూవ్‌చేసి విద్యార్థుల వేలి ముద్రను తీసుకుంటారు. ఆ తర్వాత ప్రిన్సిపాళ్లు వాటిని ఆయా సంక్షేమ శాఖలకు పంపిస్తారు. వాటిని సంక్షేమాధికారులు పరిశీలించి బార్‌కోడ్‌తో బిల్లు జనరేట్ చేస్తేనే స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు మంజూరవుతాయి.

2148
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles