Telangana Intermediate 1st & 2nd Year Results 2019

సబర్మతి స్ఫూర్తితో మూసీకి హంగులు

Fri,July 29, 2016 05:33 AM

Sabarmati inspiration musiki river

హైదరాబాద్ : మూసీ వైపు చూస్తే చాలు ..నలుపు రంగులో ప్రవహించే మురుగునీరు..పిచ్చిమొక్క లు, గడ్డి దుబ్బలు..దోమల స్వైర విహారం..అక్రమణలు.. కానీ త్వరలోనే మూసీ స్వరూపమే మారబోతుంది.నది పొడవునా ఎటూ చూసిన పచ్చదనం..ఇరువైపులా సైకిల్ ట్రాక్‌లు..ఫుడ్ కోర్టులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు..ఫౌంటెన్లు, అధునిక పార్కులు, వాక్‌వేలతో సర్వాంగ సుందరంగా మూసీ ముస్తాబుకాబోతుంది. మూసీ మచ్చను నమూలంగా తొలగించి, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గుజరాత్ రాష్ట్రంలోని ఆహ్మదాబాద్ నగర మధ్యలో సబర్మతి నది అభివృద్ధి స్ఫూర్తిగా తీసుకుని సుందరీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే మూసీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కింద సుందరీకరణ పనులు చేపట్టాలని భావించి ఆర్వీ కన్సల్టెన్సీతో సమగ్ర నివేదికను రూపొందించారు. ఈ నివేదిక ఆధారంగా మంత్రి కేటీఆర్ ఆయా శాఖల అధికారులతో మంత్రి కేటీఆర్ మూసీ పరివాహాక ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు.

మూడు విభాలుగా సుందరీకరణ పనులు చేపట్టాలని, తొలుత ఫైలెట్ ప్రాజెక్టుగా బాపుఘాట్ వద్ద పనులు చేపట్టాలని హెచ్‌ఎండీఏను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన హెచ్‌ఎండీఏ బాపుఘట్ ఈసా-మూసీ నది కేంద్రంగా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ పద్దతిలో రూ.29.27కోట్లతో ప్రత్యేక కార్యాచరణను సిద్దం చేసి ఇటీవల మంత్రి కేటీఆర్ జరిపిన సమీక్షలో ఈ ప్రతిపాదనను వివరించారు. అధికారుల ప్రతిపాదనలను పరిశీలించిన మంత్రి కేటీఆర్ టూరిజం శాఖతో కలిసి మరిన్ని విదేశీ హంగులు కల్పించే దిశగా ప్రణాళికలు సిద్దం చేయాలని హెచ్‌ఎండీఏను ఆదేశించారు. ఈ క్రమంలోనే ఈ ప్రా జెక్టు ప్రాంత పరిధి టూరిజం శాఖ చెందినది కావడంతో వచ్చే నెలలో టూరిజం శాఖతో కలిసి మరిన్ని అందాలను సమకూర్చే అంశాలపై చర్చించి స్పష్టత తీసుకువస్తామని హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు తెలిపారు.

బాపుఘాట్ వద్ద ఏం చేస్తారంటే ?
* పాయింట్ కేంద్రంగా పర్యాటక ప్రాంతాన్ని తీర్చిదిద్దబోతున్నారు.
* శాఖకు సంబంధించిన 60 ఎకరాల విస్తీర్ణంలో ఈ సుందరీకరణ పనులు జరగనున్నాయి. హెచ్‌ఎండీఏ పార్క్, దర్గా టెంపుల్‌లు కలిపి రెండు ఎకరాల 13 గుంటల స్థలం మినహా అంతా టూరిజంకు చెందినదే
ఫ్రంట్ అభివృద్ధికి రూ.13.34కోట్లు, రూ. 15.93కోట్లతో మురుగునీటి అడ్డుకట్ట, చెక్ డ్యాం నిర్మాణం, పంపింగ్ ఇతరత్రా పనులు చేపడతారు. ఈ ఎస్టీపీల నిర్మాణం జలమండలికి అప్పగించాలని యోచిస్తున్నారు.

* నది డెవలప్‌మెంట్‌లో భాగంగా స్కేటింగ్ రింక్, సెంట్రల్ ఫౌంటెయిన్స్, జాకింగ్ ట్రక్, సైక్లింగ్ ట్రాక్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఫుడ్ కోర్డ్స్, చిల్డ్రన్ ఫ్లే గ్రౌండ్ పనులు చేపట్టనున్నారు. టూరిజం, హెచ్‌ఎండీఏ, జలమండలిల సంయుక్త ఆధ్వర్యంలో మరిన్ని విదేశీ హంగులు కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందించి త్వరలోనే ప్రభుత్వం దృష్టికి ఈ ప్రతిపాదనను అందిస్తారు. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక పరమైన అంశాలపై చర్చించి పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

* మూసీ సుందరీకరణలో భాగంగానే ఉప్పల్ భగయత్ లే అవుట్ వద్ద 60 మీటర్ల మూసీ బఫర్ జోన్ పరిధిలో 3.5కిలోమీటర్ల మేర సుందరీకరణ పనులకు హెచ్‌ఎండీఏ శ్రీకారం చుట్టింది. సంస్థ నిధులతో పాత్‌వేలు, ఎంఎస్ గ్రిల్స్, ల్యాండ్ స్క్రేప్, ట్రీ ఫ్లాంటేషన్, దోమల నివారణకు మొక్కలు, స్క్రబ్స్, హెడ్జ్‌లు లాంటి నిర్మాణంతో మూసీ తీరాన్ని ఆహ్లాదకరంగా మార్చనున్నారు.

1939
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles