సీబీఎస్‌లో మాయం.. నాందేడ్‌లో ప్ర‌త్య‌క్షం

Thu,April 25, 2019 07:49 PM

rtc bus stolen from cbs found near nanded in maharashtra

హైదరాబాద్: సీబీఎస్‌లో అదృశ్యమైన ఆర్టీసీ బస్సు నాందేడ్‌లో ప్రత్యక్షమైంది. మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని సీబీఎస్‌లో పార్క్ చేసిన కుషాయిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మాయం అయింది. రాత్రి బస్సును పార్క్ చేసిన తర్వాత.. బస్సు డ్రైవర్, కండక్టర్ రెస్ట్ రూమ్‌లో నిద్రపోయారు. ఉదయం 5 గంటలకు లేచి చూస్తే వాళ్లకు బస్సు కనిపించలేదు.

దీంతో వాళ్లు అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్పెషల్‌గా ఏర్పాటైన టీమ్ బస్సు జాడ కనుక్కునే పనిలో పడింది. పలు సీసీటీవీ ఫుటేజ్‌లు, ఇతర ఆధారాలతో బస్సు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కంకిడిలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లిన హైదరాబాద్ పోలీసులు.. నాందేడ్ పోలీసులతో కలిసి బస్సు ఎత్తుకెళ్లిన దుండగులను అరెస్ట్ చేశారు. అయితే.. అప్పటికే దుండగులు.. బస్సు ఆనవాళ్లు కూడా లేకుండా.. బస్సును ముక్కలు ముక్కలు చేశారు.

2715
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles