ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రవేశ పరీక్షలో గందరగోళం

Sun,January 20, 2019 05:08 PM

హైదరాబాద్: ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రవేశ పరీక్ష నిర్వహణలో గందరగోళం నెలకొంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ ఏరోనాటికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ పరీక్ష విధానంలో లాగిన్ సమస్యలు తలెత్తాయి. వేల మంది అభ్యర్థుల హాజరు నమోదు చేసేందుకు కేవలం 3 బయోమెట్రిక్ యంత్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఓవైపు హాజరు నమోదు జరుగుతుండగానే సిబ్బంది అభ్యర్థులకు పరీక్ష పత్రం అందజేశారు. దీంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఆ పరీక్ష కేంద్రంలో ప్రవేశ పరీక్షను నిలిపివేశారు.

1785
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles