పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో రాంగోపాల్ వర్మ ఫిర్యాదు

Tue,May 22, 2018 11:12 AM

Ram Gopal Varma complained in Panjagutta police station

ఖైరతాబాద్ : అసభ్యకరమైన చిత్రపటానికి తన ఫొటోను మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ సినీ నిర్మాత, దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చిక్కడపల్లికి చెందిన పి. జయ కుమార్ ఈ నెల 18న ఓ మహిళ అసభ్యకరమైన బంగిమలో ఉన్న చిత్రపటానికి రాంగోపాల్ వర్మ ముఖాన్ని తగిలించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీన్ని గమనించి ఆర్జీవీ తనను అవమానించాడంటూ, తన పరువు తీశాడంటూ సదరు వ్యక్తిపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కోర్టు అనుమతితో కేసు నమోదు చేస్తామని తెలిపారు.

1994
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles