బుడ్డోడు.. కత్తి పట్టాడు..!

Sat,January 12, 2019 05:57 AM

rally on occasion of guru govind birth anniversary

హైదరాబాద్: సిక్కుల చివరి మత గురువు శ్రీ గురుగోవింద్ సింగ్‌జీ మహా రాజ్ 352వ జయంతిని పుర స్కరించుకుని శుక్రవారం సిక్కులు అత్యంత కన్నుల పండువగా నగర్‌కీర్తన్ ర్యాలీని నిర్వహించారు. గౌలిగూడలోని సెంట్రల్ గురుద్వార సాహెభా నుంచి ప్రారంభమైన ర్యాలీ అష్జల్‌గంజ్ గురు సింగ్ సభా, అశోక్‌బజార్, అఫ్జల్‌గంజ్, సిద్ధంబర్‌బజార్, ఎంజే మార్కెట్, పుత్లీబౌలిల మీదుగా తిరిగి గౌలిగూడ సెంట్రల్ గురుద్వారాకు చేరుకుంది.

పంజాబ్‌కు చెందిన ప్రముఖ గట్కా మార్షల్ ఆర్ట్స్ బృందం రోడ్డుపై పలు రకాల విన్యాసాలు చేశారు. గౌలిగూడ సెంట్రల్ గురుద్వారా ప్రబందక్ కమిటి అధ్యక్షులు ఇందర్ సింగ్, ప్రధాన కార్యదర్శులు ఎస్ జోగిందర్ సింగ్, సీనియర్ ఉపాధ్యక్షులు సురేందర్ సింగ్, ఉపాధ్యక్షులు ఎస్ హర్మేందర్ సింగ్‌లతో పాటు సిక్కు సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి ఇలా కత్తితో విన్యాసాలు చేయడం కట్టుకున్నది.

2312
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles