నగరంలో 18 ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీరు..

Thu,June 8, 2017 10:52 AM

Rain Water struck in Hyderabad 18 areas

హైదరాబాద్: తెల్లవారుజాము మూడు గంటల నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లో ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరంలో 18 ప్రాంతాల్లో నీరు భారీగా నిలిచిపోయింది. అంబర్‌పేట జంక్షన్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, బేగంబజార్, బల్కంపేట, సోమాజీగూడ, పంజాగుట్ట, నిమ్స్, తార్నాక, బేగంపేట, గోల్నాక, పుత్లిబౌలి, ఇమ్లిబన్ బస్టాండ్, బేగంపేట, ఓల్డ్ గాంధీ ఆస్పత్రి, నింబోలి అడ్డా, మలక్‌పేట బ్రిడ్జి, షేక్‌పేట నాలా-టోలిచౌకీ, చాద్రాయణగుట్ట-మహబూబ్‌నగర్ క్రాస్‌రోడ్‌లో వర్షపు నీరు నిలిచిపోయింది. బల్కంపేట-బేగంపేట వంతెన కింద నిలిచిన నీటిలో మినీ బస్సు మునిగిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అంబర్‌పేట, బషీర్‌బాగ్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు.. బేగంబజార్ కిషన్‌గంజ్‌లో ఇండ్లలోకి వర్షపునీరు చేరింది. పాతబస్తీ ఛత్రినాకలో వర్షపు నీరు మోకాళ్ల లోతుకు చేరింది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వనస్థలిపురంలో ప్రహరీగోడ కూలి మహిళ తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు, ఎమర్జెన్సీ బృందాలు నగరంలోని రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు క్షేత్రస్థాయి సహాయక చర్యలను చేపట్టాయి.

922
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles