క్యూనెట్ నిర్వాహకులను శిక్షించాలి

Sat,January 12, 2019 06:58 AM

Qnet management should be punished demands qnet victims

హైదరాబాద్: గొలుసుకట్టు విధానంలో వ్యాపారం చేస్తూ అ మాయక ప్రజలను మోసం చేస్తున్న క్యూనెట్ సంస్థ నిర్వాహకులను కఠినంగా శిక్షించాలంటూ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ విక్టిమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిశారు. ముంబై కేంద్రంగా దేశ వ్యా ప్తంగా ఉన్న క్యూనెట్ బాధితులు ఒక అసోసియేషన్‌గా ఏర్పడి, ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్న సైబరాబాద్ పోలీసులకు వినతి పత్రం అందజేశారు. గొలు సుకట్టు విధానంతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇలాంటి వైట్‌కాలర్ నేరస్తులతో దేశ భద్రతకు కూడా ముప్పుందని, ఎస్‌ఎఫ్‌ఐఓ(సీరియస్ ఫ్రాడ్స్ ఇన్విస్టిగేషన్ ఆఫీస్) ఒక నివేదికను తయారు చేసిందని... ఆ విషయాన్ని కమి షనర్ వద్ద బాధితులు ప్రస్తావించారు. క్యూనెట్ బాధితులు ధైర్యంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ సూచించారు.

534
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles