బల్దియా ఉద్యోగులకు ఆస్తిపన్ను మినహాయింపు

Sat,June 30, 2018 07:46 AM

Property tax exemption for Baldia employees

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు, కార్మికుల న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నట్లు, దీనికోసం అంతర్గతంగా ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి ప్రకటించారు. తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించనున్నట్లు, తన పరిధిలో లేని వాటిని ప్రభుత్వానికి నివేదించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీలో కొత్తగా ఎన్నికైన బీఎంఎస్ కార్మిక సంఘం ప్రతినిధులు శుక్రవారం కమిషనర్‌తో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఉద్యోగులు, కార్మికులకు సంబంధించి 20 అంశాలపై చర్చించారు. ఖాళీల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను కోరినట్లు చెప్పారు. రూ. 1200లోపు ఆస్తిపన్ను పరిధిలో ఉన్న జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు పన్ను మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, నామమాత్రంగా రూ. 100 చెల్లిస్తే సరిపోతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు చెప్పారు. దాదాపు 90 శాతం మంది ఉద్యోగులకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుందన్నారు. జవాన్లకు రికార్డు అసిస్టెంట్లుగా పదోన్నతి, ఉద్యోగులకు మెడికల్ ఇన్సూరెన్స్ తదితర అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ వివరించారు.

757
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles