ఆన్‌లైన్ ఉన్నా ఆఫ్‌లైన్‌లోనే..

Wed,April 24, 2019 07:18 AM

Property owners face tough time getting online mutation certificates

హైదరాబాద్: మ్యుటేషన్ ప్రక్రియలో పారదర్శకతను తేవడంతోపాటు అనవసర జాప్యాన్ని నివారించేందుకు ఉద్దేశించిన ఆన్‌లైన్ విధానాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు పూర్తిగా నీరుగార్చారు. ఆన్‌లైన్‌లో వచ్చిన వివరాల ఆధారంగా మ్యుటేషన్ ప్రక్రియ జరగాల్సివున్నప్పటికీ ఇంకా ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పిస్తూ గతంలో మాదిరిగానే మ్యాన్యువల్ పద్ధతిలో ధృవపత్రాలు తేవాలని సతాయిస్తున్నారు. దీంతో విసిగిపోతున్న బాధితులు, తమ పని చేయించుకునేందుకు లం చాలు ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడుతోంది.

ఇళ్లు, ఇంటి స్థలా లు, అపార్ట్‌మెంట్లు తదితర ఆస్తులు క్రయవిక్రయాల వివరాలు ఆన్‌లైన్ ద్వారా జీహెచ్‌ఎంసీకి పంపే విధంగా ప్రభుత్వం 2016 లోనే ఏర్పాట్లు చేసింది. దీని ప్రకారం ఆస్తి రిజిస్ట్రేషన్ సందర్భంగానే స్టాంపుడ్యూటీతోపాటు 0.1శాతం మ్యుటేషన్ ఫీజు వసూలుచేస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు ప్రత్యేకంగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి మ్యుటేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. రిజిస్ట్రేషన్ శాఖలో జరిగే ఆస్తుల లావాదేవీల డేటా ఏరోజుకారోజు ఎన్‌ఐసీ(నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్)కి, అక్కడినుంచి సీజీజీ(సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్)కు బదిలీ అవుతుంది. సీజీజీ నుంచి ఏ సర్కిల్ వివరాలు ఆ సర్కిల్‌కు పంపిస్తారు. సర్కిల్‌లో ఉండే డిప్యూటీకమిషనర్ వాటిని తమ సిబ్బం ది ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించి మ్యుటేషన్ ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. సంబంధిత ఆస్తిపై పన్ను బకాయి ఉన్నా, లేక పన్ను మదింపులో తేడాలున్నా బల్దియా సిబ్బంది యజమానికి నోటీసు జారీచేసి ఆ మేరకు పన్నును వసూలుచేస్తారు. ఆ తరువాత మ్యుటేషన్ ప్రక్రియ పూర్తిచేస్తారు. ఒకవేళ పన్ను నిర్థారణ, చెల్లింపు సవ్యంగానే ఉంటే యథావిథిగా మ్యుటేషన్ జరిగిపోతుంది. ఈ మొత్తం ప్రక్రియ కొనుగోలు చేసినవారు, విక్రయించినవారి ప్రమేయం లేకుండానే పూర్తవుతుంది.

అయితే, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మాత్రం ఇం దు కు విరుద్ధం. ఇంకా జీహెచ్‌ఎంసీ అధికారులు పాతపద్ధతిలోనే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. అమ్యామ్యాలకోసం జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు. మ్యుటేషన్ ఫీజు చెల్లించిన రసీదుతోపాటు సేల్‌డీడ్ పత్రాలు సమర్పిస్తే పరిశీలిస్తామని చెబుతున్నా రు. షేక్‌పేట్‌లో ఓ ఆస్తి మ్యుటేషన్‌పై సంబంధిత అధికారులను సంప్రదించగా, మొత్తం పత్రాలు సమర్పించిన తరువాత క్షేత్రస్థాయిలో పరిశీలించి మ్యుటేషన్ చేస్తామని పేర్కొన్నారు.

1840
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles