అధికారులతో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి సమావేశం

Fri,June 29, 2018 03:32 PM

Principal Secretary of Municipal arvind kumar meeting with all officials

హైదరాబాద్: పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ, జలమండలి, హైదరాబాద్ రహదారి అభివృద్ధి సంస్థ అధికారులు హాజరయ్యారు. ఆయా విభాగాల వారీగా జరుగుతున్న పనుల పురోగతిపై ఈసందర్భంగా సమీక్ష నిర్వహించారు. కొనసాగుతున్న పనులన్నింటినీ అక్టోబర్ నెలాఖరు వరకు పూర్తి చేయాలని అరవింద్ ఆదేశాలు జారీ చేశారు. రహదారి మరమ్మతులు, ఫుట్‌పాత్‌ల నిర్మాణాలు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

వర్షాకాలం పూర్తయ్యాకే బీటీ రహదారుల నిర్మాణం చేపట్టాలి. జలమండలి ఇంజినీర్లతో జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు సమన్వయం చేసుకోవాలి. జలమండలి పనులు పూర్తి చేశాకే రహదారుల పనులు చేపట్టాలి. పౌరులు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలి.. అరవింద్ కుమార్

634
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles