విద్యార్థినిపై స్కూల్ ప్రిన్సిపాల్ భర్త వేధింపులు

Tue,May 8, 2018 06:34 AM

Principal husband molesting a girl in sherilingampally limits

శేరిలింగంపల్లి : గౌలిదొడ్డి సాంఘిక, సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో లైంగిక వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికపై వేధింపుల కు పాల్పడిన పాఠశాల ప్రిన్సిపాల్ భర్తపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఈ విషయమై గురుకుల విద్యాసంస్థల ఉన్నతాధికారులు ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. శేరిలింగంపల్లి మండలం, గౌలిదొడ్డి గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో సంగారెడ్డి ప్రాంతానికి చెందిన ఓ బాలిక 9వ తరగతి చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉంటుంది. కాగా.. పాఠశాల ప్రిన్సిపాల్ ప్రమోద కుటుంబంతో కలిసి పాఠశాల ఆవరణలోని క్వార్టర్స్‌లో ఉంటుంది.

ప్రిన్సిపాల్ ఇంట్లో టీవీ చూసేందుకు వెళ్లిన బాలిక పట్ల ప్రిన్సిపాల్ భర్త దామోదర్ అసభ్యంగా ప్రవర్తించి లైంగికదాడికి య త్నించాడు. దీంతో సదరు బాలిక తల్లిదండ్రులకు చె ప్పింది. వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి గురుకుల విద్యాసంస్థల అధికారులు కమిటీ వేసి విచారణ చేపట్టారు. అయి నా దామోదర్‌పై చర్యలు తీసుకోకపోవడంతో బాలిక తల్లిదండ్రులు ఈ నెల 1న గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యా దు చేశారు. పోలీసులు 3న బాలిక స్టేట్‌మెంట్ రికార్డు చేసి నిందితుడు దామోదర్‌పై కేసు నమోదు చేశారు. నిందితుడు దామోదర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా.. ఈ విషయమై సదరు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ప్రమోదను గురుకుల విద్యాసంస్థల ఉన్నతాధికారులు ఇటీవల సస్పెండ్ చేశారు. ప్రస్తుతం గౌలిదొడ్డి బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల తాత్కాలిక ప్రిన్సిపాల్‌గా ప్రమోద స్థానంలో పక్కనే ఉన్న గురుకుల ఐఐటీ అకాడమీ ప్రిన్సిపాల్ వివేకానందాకు బాధ్యతలు అప్పగించారు.

2218
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles