రేపటి నుంచి 24 వరకు బొల్లారంలో రాష్ట్రపతి

Thu,December 20, 2018 08:13 AM

President Ram Nath Kovind to reach Hyderabad this evening

హైదరాబాద్ : శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెలలో హైదరాబాద్ నగరానికి విచ్చేయనున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పలుశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులంతా ప్రత్యేక చొరవ తీసుకని పకడ్భందీగా ఏర్పాట్లు చేయాలన్నారు.

రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అన్ని శాఖల అధికారులు కార్యాచరణ ప్రణాళిక తయారుచేసుకుని తదనుగుణంగా ఏర్పాట్లుచేసుకోవాలన్నారు. పర్యటనలో భాగంగా బందోబస్లు, ట్రాఫిక్ ఏర్పాట్లు, నిరంతర విద్యుత్తు సరఫరా, రోడ్ల మరమ్మతులు, పారిశుధ్యం తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రపతి ఈ నెల 21వ తేదీ సాయం త్రం పూట నగరానికి విచ్చేయనున్నారని, అప్పటి నుంచి తిరుగు ప్రయాణం అయ్యేవరకు ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చూసుకోవాలన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ జి. రవి, ఆర్డీవో రాజాగౌడ్, పోలీసు అధికారులు డీఎస్‌చౌహన్ పాల్గొన్నారు.

1208
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles