జులై 3న తెలుగు యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవం

Thu,June 28, 2018 07:52 AM

Potti Sreeramulu Telugu University 14th convocation on July 3

హైదరాబాద్ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 14వ స్నాతకోత్సవం జూలై 3వ తేదీన రవీంద్రభారతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ తెలిపారు. తెలుగువర్సిటీ వీసీ చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిజిస్ట్రార్ అలేఖ్య, పరీక్షల నియంత్రణాధికారి రెడ్డి శ్యామలతో కలిసి ఆయన వివరాలను వెల్లడించారు. చాన్స్‌లర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యఅతిథిగా కవి, పండితుడు, నిఘంటు నిర్మాణకర్త, ద్రవిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య రవ్వా శ్రీహరి పాల్గొని స్నాతకోత్సవ ప్రసంగం చేస్తారని వివరించారు.

రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా నాలుగు సంవత్సరాల అనంతరం గడిచిన 2014విద్యా సంవత్సరం 17వరకు వర్సిటీలో రెగ్యులర్, దూరవిద్య, సాయంత్రం కోర్సుల విభాగాల విద్యార్థులకు పీహెచ్‌డీ పట్టాలు, బంగారు పతకాలు అందజేస్తామని తెలిపారు. 79గోల్డ్ మోడల్స్, 106 మందికి పీహెచ్‌డీ పట్టాలు, 66 మందికి ఎంఫిల్ పట్టాలు, ఎంఏ, ఎంపీఏ, బీఎఫ్‌ఏ కోర్సుల విద్యార్థులు 532, సాయంత్రం కోర్సుల్లో 400 మందికి పట్టాలను అందజేయనున్నట్లు వెల్లడించారు.

ఉభయ తెలుగు రాష్ర్టాల్లో కొనసాగుతున్న తెలుగువర్సిటీ ప్రాంగణాల విద్యార్థులకు పట్టాలను గవర్నర్ నరసింహన్ అందజేస్తారన్నారు. విద్యార్థులు ఉదయం 9 నుంచి 10 గంటలలోపు రవీంద్రభారతికి చేరుకొని తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. తెలుగువర్సిటీని అన్నిరకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సత్యనారాయణ వివరించారు.

1033
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles