ఆ 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

Fri,December 7, 2018 04:12 PM

Polling concluded in 13 Maoist affected constituencies in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలోని మావోయిస్టు సమస్యాత్మక 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సమయం ముగిసినా క్యూలైన్లో ఉన్న అందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 5 నియోజకవర్గాలు.. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాలు.. పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం, వరంగల్ జిల్లాలో భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

2505
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles