వీడిన చాందినీ జైన్ డెత్ మిస్ట‌రీ!Wed,September 13, 2017 07:51 AM

Police found the death mystery of inter girl chandini

హైద‌రాబాద్: న‌గ‌రంలోని మదీనాగూడలో అదృశ్యమైన చాందినీ జైన్ మూడు రోజుల తర్వాత అమీన్‌పూర్ గుట్టలో శవమై కనిపించిన సంగ‌తి తెలిసిందే. న‌గ‌రంలో సంచ‌ల‌నం సృష్టించిన చాందినీ హ‌త్య కేసును హ‌త్య జ‌రిగిన కొన్ని గంట‌ల్లోనే పోలీసులు ఛేదించారు. చాందినీ జైన్ ను త‌న ప్రియుడు సాయి కిర‌ణ్ హ‌త్య చేసిన‌ట్లుగా పోలీసులు నిర్ధారించారు. దీంతో సాయి కిర‌ణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సాయి కిర‌ణ్ కూడా మ‌దీనా గూడ‌లోని అపార్ట్ మెంట్ లో నివాస‌ముంటున్నాడు. త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని సాయి కిర‌ణ్ పై చాందినీ ఒత్తిడి తెస్తుండ‌టంతోనే త‌న‌ను హ‌త్య చేసిన‌ట్లు సాయి కిర‌ణ్ పోలీసులకు తెలిపాడు. ప‌థ‌కం ప్ర‌కార‌మే చాందినీని అమీన్ పూర్ లోని గుట్ట‌ల్లోకి తీసుకెళ్లి హ‌త్య చేసిన‌ట్లు నిందితుడు సాయికిర‌ణ్ ఒప్పుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. దీంతో చాందినీ డెత్ మిస్ట‌రీ వీడింది. అయితే.. హ‌త్య కు ముందు చాందినీపై లైంగిక దాడి జ‌ర‌గ‌లేద‌ని పోలీసుల ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది. అనంత‌రం పోలీసులు సాయి కిర‌ణ్ ను చాందినీని చంపిన‌ అమీన్ పూర్ గుట్ట‌కు తీసుకెళ్లి విచార‌ణ చేప‌ట్టారు.

5272
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS