ఐదే నిమిషాల్లో దొరకబుచ్చుకున్నాడు

Sun,August 18, 2019 06:41 AM

Police constable found a thief with in a five minutes

హైదరాబాద్: టెక్నాలజీని ఉపయోగించి చిక్కడపల్లికి చెందిన బూకోల్ట్స్ కానిస్టేబుల్ ..ఐదు నిమిషాల్లో బైక్ దొంగ ను పట్టుకున్నాడు. దీంతో నగర సీపీ అంజనీకుమార్ శనివారం అతన్ని అభినందించారు. వివరాల్లోకి వెళ్లితే.. అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి యాక్టివా బైక్‌ను తోసుకుంటూ పోతున్నాడు. అతను వెళ్తున్న శైలిని చూసి అనుమానం వచ్చిన చిక్కడపల్లికి చెందిన బూకోల్ట్స్ కానిస్టేబుల్ వి.సంతోశ్‌కుమార్ అతన్ని అపి, వివరాలు అడగడంతో.. తన పేరు శ్యామ్ అలియాస్ నర్సింహా అంటూ చెప్పుకున్నాడు. అయితే తన చేతిలో ఉన్న ట్యాబ్‌లో ఆ వాహనం నంబర్‌ను టైప్ చేసి చూడగా హసీనా అనే పేరుతో ఉంది. అందులోని ఫోన్ నంబర్‌కు కానిస్టేబుల్ ఫోన్ చేయగా.. ఆమె తన వాహనం రెండు రోజుల క్రితం కిషన్‌బాగ్‌లో చోరీకి గురయ్యిందని, బహుదూర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పింది. దీంతో నిందితుడి ఫింగర్ ఫ్రింట్స్‌ను కూడా పోలీసులు పరిశీలించడంతో.. గతంలోను బైక్ దొంగతనాలు చేసినట్లు నిర్ధారణ అవ్వడంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం సీపీ అంజనీకుమార్ తెలుసుకొని, కానిస్టేబుల్ సంతోశ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డిలను కమిషనరేట్‌కు పిలిపించారు. ఐదు నిమిషాల వ్యవధిలోనే టెక్నాలజీని ఉపయోగించి ఒక బైక్ దొంగను పట్టుకోవడంపై వారిని సీపీ అభినందిస్తూ, మెమోంటోను అందించారు.

1718
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles