పంద్రాగస్టు వేడుకలకు బ్యాగులు తీసుకురావొద్దు: సీపీ

Tue,August 13, 2019 05:59 PM

Police Commissioner Anjani kumar review meeting on 15 August celebration

హైదరాబాద్: నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ 15 ఆగస్టు వేడుకలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలకు వచ్చేవారు హ్యాండ్ బ్యాగులు, బ్రీఫ్‌కేసులు, కెమెరాలు, టిఫిన్ బాక్స్‌లు, వాటర్ బాటిళ్లు తీసుకురావద్దని తెలిపారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరేడ్ జరిగే సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు.

1148
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles