హరికృష్ణ మరణం బాధ కలిగిస్తోంది: పోచారం

Thu,August 30, 2018 10:18 AM

Pocharam express Condolence to harikrishna death

హైదరాబాద్: నిన్న రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మరణం బాధ కలిగిస్తోందని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడి అన్నారు. హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం పోచారం మాట్లాడుతూ..చైతన్యరథంపై హరికృష్ణ వేల కిలోమీటర్లు తిరిగారని, వేల కిలోమీటర్లు తిరిగినా చైతన్య రథానికి ఎలాంటి ఘటనలు జరగలేదని చెప్పారు. పార్టీలో ఉన్నపుడు ఆయన ఎంపీ లాడ్స్ నిధులు ఇచ్చారని పోచారం గుర్తు చేసుకున్నారు. వెంకటేశ్వరస్వామి ఆలయానికి రోడ్డు కోసం రూ.10 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని వేడుకుంటున్నా. ఆయన కుటుంబసభ్యులను తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు.

987
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles