నేడు కేబీఆర్ పార్కులో పీకాక్ ఫెస్టివల్

Tue,December 3, 2019 06:48 AM

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో నేడు పీకాక్ ఫెస్టివల్ నిర్వహణ జరగనుంది. పార్కును జాతీయ ఉద్యానవనంగా గుర్తించిన సందర్భంగా డిసెంబర్ 3న ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా అటవీ అధికారి పూజారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడిస్తూ.. నేడు ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తున్న నెమళ్ల ఉత్సవాల్లో భాగంగా కేబీఆర్ నేషనల్ పార్కులో ఉన్న నెమళ్లపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా వివిధ పక్షిజాతులకు చెందిన విశేషాలను వివరిస్తామన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేబీఆర్ పార్కులో ప్రస్తుతం 633 నెమళ్లు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే 35 నెమళ్లు అధికంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

307
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles