పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు వీరే..

Mon,March 25, 2019 09:42 PM

Parliament Election Observers

హైదరాబాద్‌ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పర్యవేక్షకులను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. హైదరాబాద్ పార్లమెంట్‌కు అర్వింద్ పాల్‌సింగ్ సంధూ (ఐఏఎస్), సికింద్రాబాద్ లోక్‌సభకు బినయ్‌కుమార్ రాయ్ (ఐఏఎస్)లను నియమించింది. వీరు ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కలెక్టరేట్‌మూడో అంతస్తులో అందుబాటులో ఉంటారని, ఏవైనా ఫిర్యాదులు, సూచనలు, సలహాలుంటే పరిశీలకుల దృష్టికి తీసుకురావొచ్చని రిటర్నింగ్ అధికారులు మాణిక్‌రాజ్ కన్నన్, గుగులోతు రవిలు తెలిపారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిశీలకులు సెల్ నెంబర్ 63090 25519కు ఫోన్‌చేసి, లేదంటే ఎస్‌డీసీ (ఎల్‌పీవో) ఛాంబర్‌లో స్వయంగా, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిశీలకులు సెల్ నెంబర్ 91211 08226కు ఫోన్‌చేసి కాని, లేదంటే కలెక్టరేట్‌లోని అడినిస్ట్రేటివ్ అధికారి (ఏవో) ఛాంబర్‌లో కలిసి, నేరుగా సంప్రదించి ఫిర్యాదులు చేయవచ్చని వెల్లడించారు.

883
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles