బంపర్ ఆఫర్.. ఏడాది పాటు ఉచితంగా బిర్యానీ..

Fri,June 7, 2019 06:00 PM

హైద‌రాబాద్: ప్యారడైజ్ హోటల్స్ సంస్థ బిర్యానీ ప్రియుల కోసం మ‌రో ఆక‌ర్షణీయ‌మైన ప‌థ‌కాన్ని నేడు ప్ర‌క‌టించింది. #వ‌ర‌ల్డ్‌క‌ప్‌విత్‌ప్యార‌డైజ్‌ (#WorldCupWithParadise) పోటీలో పాల్గొని ఏడాదిపాటు వారంలో ఒక బిర్యానీ చొప్పున 52 వారాలు ఉచితంగా, గిఫ్ట్ రూపంలో పొందవ‌చ్చ‌ని వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న వ‌ర‌ల్డ్‌క‌ప్ నేప‌థ్యంలో న‌గ‌రంలోని క్రికెట్ ప్రియుల కోసం ఈ ప్ర‌క‌ట‌న‌ను ప్యార‌డైజ్ చేసింది.


ఈ ఆక‌ర్ష‌ణీయ పోటీ జూన్ 7వ తేదీన ప్రారంభ‌మై జూలై 18వ తేదీ 2019 వ‌ర‌కు భార‌త‌దేశం అంత‌టా నిర్వ‌హిస్తున్నారు. విజేత‌ల‌కు ప్ర‌తివారం బ‌హుమ‌తులు అందిస్తారు. బిర్యానీ ప్రియులు ఈ స‌మ‌యంలో ప్యార‌డైజ్ ఫుడ్ కోర్టుల డైన్ ఇన్/ఎక్స్‌ప్రెస్ ఔట్‌లెట్‌ల‌కు కుటుంబం, స్నేహితుల‌తో విచ్చేసి ఈ పోటీ గురించి వివ‌రంగా తెలుసుకోవ‌చ్చు. ఈ పోటీలో పాల్గొని, విజేత‌లుగా నిల‌వ‌వ‌చ్చో తెలుసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న క్రికెట్ వ‌ర‌ల్డ్‌ క‌ప్ సంద‌ర్భంగా ``ప్ర‌పంచంలోనే అత్యంత ఫేవ‌రెట్ బిర్యానీ`` ప్రేమికుల కోసం ఈ స్పెష‌ల్ పోటీని అందుబాటులోకి తెచ్చింది.

ఈ నూత‌న పోటీ గురించి ప్యార‌డైజ్ ఫుడ్ కోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ గౌతం గుప్తా మాట్లాడుతూ, ``మా వినియోగ‌దారుల‌కు అత్యుత్త‌మ‌మైన అనుభూతిని అందించ‌డంతో పాటు, ప్యార‌డైజ్ కేంద్రంగా నిత్య‌నూత‌నంగా కొత్త అనుభూతుల‌ను మా అతిథులు పొందుతున్నారు. ప్యార‌డైజ్ ఔట్‌లెట్‌లోకి విచ్చేసి `ప్ర‌పంచంలోనే ఫేవ‌రెట్ బిర్యానీ`ని త‌మ స‌న్నిహితుల‌తో క‌లిసి ఆస్వాదించ‌వ‌ల‌సిందిగా మా బిర్యానీ ప్రేమికుల‌ను ఈ సంద‌ర్భంగా మేం కోరుకుంటున్నాం. ఈ క్రికెట్ సీజ‌న్ సంద‌ర్బంగా, మా వినియోగ‌దారుల‌కు వ‌ర‌ల్డ్ క‌ప్‌ను ప్ర‌త్యేకంగా ఉండాల‌ని మేం ఆకాంక్షించాం. ప్ర‌తివారం వారు ఒక బిర్యానీని గెలుచుకునే అవ‌కాశం క‌ల్పించ‌డం ద్వారా వారి సంతోషాన్ని రెట్టింపు చేయాల‌ని సిద్ధ‌మ‌య్యాం`` అని గుప్తా వివ‌రించారు.

16573
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles