ఆ పైలట్‌ను బాగా చూసుకోవాల్సిన బాధ్యత పాకిస్థాన్‌దే: అసద్

Wed,February 27, 2019 05:28 PM

హైదరాబాద్: భారత్‌కు చెందిన పైలట్ అభినందన్‌ను తాము కస్టడీలోకి తీసుకున్నామని పాకిస్థాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అతను కస్టడీలో ఉన్న వీడియోను కూడా రిలీజ్ చేసింది. అయితే ఆ పైలట్ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని, ఈ కష్టకాలంలో అతని కుటుంబం ధైర్యంగా ఉండాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. అంతేకాదు ఆ పైలట్ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత పాకిస్థాన్‌దేనని స్పష్టం చేశారు. జెనీవా కన్వెన్షన్స్‌లోని ఆర్టికల్ 3 ప్రకారం ఖైదీలను అన్ని దేశాలు మానవతా దృక్పథంతో చూడాలి. సదరు ఐఏఎఫ్ పైలట్ విషయంలో పాకిస్థాన్ ఇలాగే వ్యవహరించాలి. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నా.. పాక్ అతన్ని బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని అసద్ ఆ ట్వీట్‌లో స్పష్టం చేశారు.


6282
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles