నేడు ఖైదీల కళాఖండాల ఎగ్జిబిషన్ ప్రారంభం

Fri,April 27, 2018 08:20 AM

Paintings by prisoners on display in Hyderabad

హైదరాబాద్ : శిక్ష అనుభవించేందుకు జైలుకు వస్తున్న వారి పరివర్తనలో మార్పు తీసుకువచ్చేందుకు జైళ్లశాఖ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నది. ఈక్రమంలోనే పెయింటింగ్‌పై ఆసక్తి ఉన్న ఖైదీలను ఎంపిక చేసి, అంతర్జాతీయస్థాయి కళాకారులకు ఆర్ట్స్‌పై ఏడాది కాలం శిక్షణ ఇప్పించారు. చంచల్‌గూడ, చర్లపల్లి కేంద్ర కారాగారాల్లో ఉన్న దాదాపు 40మంది కుంచె నుంచి జాలువారిన కళాఖండాలను కృష్ణకృతి ఫౌండేషన్ వారితో కలిసి జైళ్లశాఖ 11రోజులపాటు ప్రదర్శన నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. బంజారాహిల్స్ రోడ్ నం.10లో ఉన్న కళాకృతి ఆర్ట్ గ్యాలరీ నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్, సేల్స్‌ను సాయంత్రం 6గంటలకు జైళ్లశాఖ డీజీ వీకే సింగ్ ప్రారంభిస్తున్నట్లు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ అర్జున్‌రావు తెలిపారు. ఈ ప్రదర్శన మే 7వ తేదీ వరకు ఉంటుందన్నారు. జైళ్లశాఖ ఐజీ ఆకుల నరసింహ, డీఐజీ సైదయ్య, ఇతర అధికారులు పాల్గొంటున్నారన్నారు.

436
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS