3 నిమిషాలకో రైలు.. రోజుకు 1.25 లక్షల మంది ప్రయాణికులు

Wed,October 24, 2018 06:23 AM

హైద‌రాబాద్‌: హైదరాబాద్ మెట్రోరైలు ఎల్బీనగర్ మార్గం ప్రయాణం ప్రారంభించి నెలరోజులు కావస్తున్నది. గత నెల 24వ తేదీన ప్రారంభమైన ఎల్బీనగర్ నుంచి మియాపూర్ మార్గం నగర ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తున్నది. ఎల్బీనగర్ మెట్రో ప్రయాణం పట్ల ప్రజలు అత్యం త ఆసక్తి కనబర్చుతున్నట్లు మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. నెలరోజులు కావస్తున్న సందర్భంగా ఎల్ అండ్‌టీ ఎండీ కేవీబీ రెడ్డి, హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్బీనగర్-మియాపూర్ మార్గం(కారిడార్1)లో ప్రతీరోజు సగటున 1.25 లక్షల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. కారిడార్-3కు సంబంధించి నాగోల్ నుంచి అమీర్‌పేట్ మార్గంలో ప్రతీరోజు 50 వేల మంది ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. ఎల్బీనగర్ మార్గంలో రద్దీ సమయంలో ప్రతీ 3.15 నిమిషాలకు ఒక మెట్రోరైలు నడుపుతున్నామని చెప్పారు. ప్రయాణికుల రద్దీ, అదనపు సౌకర్యాల వంటి విషయాలపై చర్చించినట్లు తెలిపారు. ఎల్బీనగర్-మియాపూర్ మెట్రోమార్గంపై చిన్నపాటి ఫిర్యాదులు మినహా, స్థానిక పౌరులు తమ ఆమో దం, హర్షం వ్యక్తం చేశారని సంబంధిత అధికారులు అన్నారు. ఎల్బీనగర్ స్టేషన్‌నుంచి ప్రతీరోజు 30 వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని, ఇది క్రమేపి పెరుగుతుందని చెప్పారు.


ఎల్బీనగర్-మియాపూర్ (కారిడార్-1) నడుమ ప్రతీరోజు 21 రైళ్లు నడిపిస్తున్నామని, నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు 12 రైళ్లు నడిపిస్తున్నట్లు ఎల్ అండ్ టీ, హెచ్చెమ్మార్ ఎండీలు ఎన్వీఎస్ రెడ్డి, కేవీబీరెడ్డి వెల్లడించారు. ప్రతీరోజు 31 మంది రైళ్లు నడిపిస్తున్నట్లు తెలిపారు. కారిడార్-1లో ప్రతీరోజు 284 ట్రిప్పులు, కారిడార్-3లో 266 ట్రిప్పులు కలిపి ప్రతీరోజు ప్రస్తుతమున్న ఆపరేషన్స్‌లో 550 ట్రిప్పుల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నట్లు చెప్పారు. అక్టోబర్ 22న రెండు మెట్రో కారిడార్లలో కలిసి 1.90 లక్ష ల మంది ప్రయాణికులు ప్రయాణించారన్నా రు. మెట్రోరైలు సర్వీసులను మరింత మంది వినియోగించుకోవాలని కోరారు. సమీక్షలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎల్ అండ్‌టీ మెట్రోరైలు హైదరాబాద్ లిమిటెడ్ అనీల్‌షైనీ పాల్గొన్నారు.


22వ తేదీ రికార్డైన వివరాలు ఇవే..

22వ తేదీ రికార్డైన వివరాల ప్రకారం రెండు కారిడార్లలో కలిసి 1.90 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించగా అందులో1.77 లక్షల మంది పెయిడ్ ప్యాసింజర్స్ అని పేర్కొన్నారు. మిగతావారందరూ పాస్‌లతో ప్రయాణించినట్లు తెలిపారు. ఇందులో అత్యధిక ప్రయాణికులు రాకపోకలు సాగించిన స్టేషన్లు ఇవే.

4825
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles