12 గంటల్లోనే ఓయూ హత్య కేసును ఛేదించిన పోలీసులు

Thu,May 2, 2019 07:55 AM

OU murder case mystery cracked in 12 hours

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మంగళవారం జరిగిన హత్యను కేవలం పన్నెండు గంటల్లోనే ఛేదించి పోలీసులు తమ పనితీరును మరోసారి నిరూపించుకున్నారు. కేవలం క్షణికావేశంలో తన సొంత బావమరిది తలపై బండరాయితో మోది హత్యకు పాల్పడడం పోలీసులను సైతం నివ్వెరపరిచింది.

ఓయూ సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మంగళవారం ఓయూలోని మోహినీ చెరువు సమీపంలో ఒక శవం ఉందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా రామంతాపూర్‌లోని కామాక్షిపురంలో కూలీ పని చేసుకునేవారుగా గుర్తించి మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన ఇప్ప చందు(38)ఆరు నెలల క్రితం నగరానికి వచ్చి తన మేనకోడలి వద్ద ఉంటూ కూలీ పని చేసుకుంటున్నాడు. చందు సొంత చెల్లె భర్త అయిన కంకణాల తిరుపతిరెడ్డి(40) మంచిర్యాల సమీపంలోని టేకుపట్ల గ్రామానికి చెందినవాడు. తిరుపతిరెడ్డి కూడా అక్కడే ఉంటూ కూలీ పనిచేసుకుంటున్నాడు. ఇద్దరు కలిసి గతంలో మంచిర్యాలలో డ్రైవర్, క్లీనర్‌లుగా పనిచేశారు.

నగరంలో పనిచేయగా వచ్చిన డబ్బుతో మద్యం సేవించేవారు. మంగళవారం ఓయూకు వచ్చి మద్యం సేవించేందుకు మత్తులో మాటామాటా పెరిగింది. ఆగ్రహానికి గురైన తిరుపతిరెడ్డి బండరాయితో చందు తలపై మోది హత్య చేసి పారిపోయాడు. హత్యా ఘటన వెలుగులోకి వచ్చిన ఏడు గంటల్లోనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

2194
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles