అక్టోబర్ 4 నుంచి తెలుగువర్సిటీ దూర విద్య వార్షిక పరీక్షలు

Thu,September 28, 2017 07:10 AM

Open Degree final exams will be held from 4th october in potti sriramulu telugu university

హైద‌రాబాద్‌: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, దూర విద్యా కేంద్రం నిర్వహించే వివిధ కోర్సులకు వార్షిక పరీక్షలు అక్టోబర్ 4 నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంగణంతో పాటు వరంగల్, రాజమండ్రి, శ్రీశైలం, కూచిపూడి ప్రాంగణాలలో జరుగుతాయి.

ఈ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు హాల్ టికెట్స్ పోస్టు ద్వారా పంపడం జరిగింది. హాల్ టికెట్స్ అందని వారు సంబందిత ప్రాంగణాల నుంచి డూప్లికేట్ హాల్ టికెట్స్ పొందవచ్చునని రిజిస్ట్రార్ ఆచార్య వి. సత్తిరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. మరిన్ని వివరాల కోసం 040-23241923 నెంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.

1877
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles