నగరంలో 20వ స్టేజీ వరకు రూ.5 మాత్రమే పెంపు

Tue,December 3, 2019 08:24 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుడిపై భారం వేయకుండా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో 20వ స్టేజీ వరకు కేవలం గతంలో ఉన్న టికెట్‌ ధరకు అదనంగా రూ.5 మాత్రమే పెంచారు. (ఉదాహరణకు రూ.10 ఉంటే 15గా.., 30 ఉంటే 35గా.. పెంచారు.) 21వ స్టేజీ నుంచి ఒక్కో ప్రయాణికుడి టికెట్‌పై రూ.10 మాత్రమే పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే దూరానికి కాకుండా కేవలం ఒక్కో ప్రయాణికుడి టికెట్‌పై రూ.5 పెంచారు. అరుదుగా సుదూర ప్రాంతాలకు వెళ్లే వారిపై కేవలం టికెట్‌పై రూ.10 పెంచారు. 20 స్టేజీలుంటే 40 కి.మీటర్ల దూరం ఉంటుంది. నగరంలో ప్రయాణికులు 40 కిలోమీటర్ల కన్నా తక్కువ ప్రయాణించేవారే ఎక్కువగా ఉంటారు. గతంలో ఉన్న టికెట్‌ ధరతో పోల్చితే కేవలం రూ.5 మాత్రమే అదనంగా ఉంటుంది. బస్సు చార్జీలకు చిల్లర ఇబ్బందులు లేకుండా రౌండ్‌ ఫిగర్‌ చేశారు. గతంలో కూడా చిల్లర సమస్యను దృష్టిలో ఉంచుకుని కండక్టర్లకు, ప్రయాణికులకు మధ్య గొడవలకు ఆస్కారం లేకుండా రూ.5,10,15 ,20 విలువ గల టికెట్లను అందుబాటులోకి తెచ్చారు. ఇదే విధానంలో మళ్ళీ పెరిగిన చార్జీలను కూడా సవరించారు. ఇప్పటికే పెరిగిన చార్జీలకు అనుగుణంగా టీమ్స్‌ మిషన్లలో సాఫ్ట్‌వేర్‌ను సవరించారు.

1915
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles