ఆ కోట్ల విలువైన టిఫిన్ బాక్స్‌లో లంచ్ చేశాడట!

Tue,September 11, 2018 01:38 PM

One of the thieves used Nizam Tiffin box worth crores to eat lunch say Police

హైదరాబాద్: నిజాం మ్యూజియం నుంచి చోరీకి గురైన కోట్ల విలువైన టిఫిన్ బాక్స్, డైమండ్లు, కెంపులు పొదిగిన కప్పు, సాసర్, స్పూన్‌ను హైదరాబాద్ పోలీసులు రికవరీ చేశారు. వీటిని దొంగిలించిన తర్వాత ఆ దొంగలు ముంబై వెళ్లి అక్కడి ఓ లగ్జరీ హోటల్లో ఉన్నారు. దొంగల్లో ఓ వ్యక్తి ఆ కోట్ల విలువ చేసే టిఫిన్ బాక్స్‌ను రోజూ తినడానికి వాడినట్లు పోలీసులు వెల్లడించారు. గుల్బర్గలో వాళ్లను పట్టుకున్న పోలీసులు.. వాళ్లు చోరీ చేసిన విలువైన వస్తువులన్నింటినీ రికవరీ చేశారు. పురానీ హవేలీలోని నిజాం మ్యూజియంలో ఈ నెల 2న జరిగిన ఈ చోరీ కేసును ఛేదించడానికి 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మ్యూజియం నుంచి ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చి బైక్‌పై పారిపోయినట్లుగా సీసీటీవీ ఫుటేజీలో తేలింది. దీంతో ఈ చోరీలో కనీసం ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఏడో నిజాంకు చెందిన వస్తువులు కావడంతో ఆయన మనవడు నవాబ్ నజఫ్ అలీఖాన్, నిజాం ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్.. గత వారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. చారిత్రక ప్రాముఖ్యం ఉన్న ఆ వస్తువులను ఎలాగైనా రికవరీ చేయాలని అందులో కోరారు.

5701
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles