వైభవంగా సింహవాహిని మహంకాళి బోనాలు..

Sun,August 5, 2018 08:40 AM

Old City Laldarwaza Simha Vahini Mahankali Bonalu

హైదరాబాద్: నగరం బోనాల జాతరకు ముస్తాబైంది. గోల్కొండ, లష్కర్ బోనాలు అంగరంగవైభవంగా జరుపుకున్న నగరవాసులు లాల్ దర్వాజ బోనాలకు సిద్ధమయ్యారు. లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు నేడు ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఈ రోజు తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ అర్చకులు బలిగంప సమర్పించారు. భక్తులు సింహవాహిని అమ్మవారికి తొట్టెలు, బోనాలు సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజ బోనాలతో పాటు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో బోనాల జాతర నిర్వహించనున్నందున వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

లాల్ దర్వాజకు మంత్రులు

నేడు లాల్ దర్వాజలో సింహవాహిని మహంకాళి అమ్మవారిని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకొని పట్టు వస్ర్తాలు సమర్పిస్తారు.

పట్టువస్ర్తాల సమర్పణ

చిలకలగూడ కట్ట మైసమ్మ అమ్మవారికి మంత్రి పద్మారావు గౌడ్, అక్కన్న మాదన్న ఆలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరఫున పట్టు వస్ర్తాలు సమర్పిస్తారు. చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకొని పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు. కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ ఆలయంలో అమ్మవారిని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దర్శించుకొని పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు.

2415
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles