మహిళలకు ప్రత్యేక యాప్.. ‘న్యారా’

Wed,May 29, 2019 05:47 AM

Nyaraa App for women by Vivant

హైదరాబాద్ : డిజిటల్ హెల్త్ టెక్నాలజీ స్టార్టప్ అయిన వివంట్ ప్రపంచ రుతు పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల కోసం ‘న్యారా’ పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. రుతుక్రమం, సంతానోత్పత్తి, అండాల విడుదల, లైఫ్‌ స్టైల్, శారీరక శ్రమ తదితర అంశాలకు సంబంధించిన వివరాలను ఇందులో పొందుపరిచారు. యాపిల్, గూగుల్ ప్లేస్టోర్‌లలో ఈ యాప్ అందుబాటులో ఉన్నట్లు వివంట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ యాప్ ద్వారా మహిళలు తమ ఆరోగ్యం, పరిశుభ్రతపై అవసరమైన సమాచారాన్ని పొందవచ్చని, ప్రస్తుతం ఇంగ్లిష్, హిందీలో అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను త్వరలో ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి తేనున్నట్లు వారు వివరించారు.

1268
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles