క్యాన్సర్ నియంత్రణలో సైడ్ ఎఫెక్ట్‌లు లేని ఔషదాలు

Thu,March 15, 2018 07:09 AM

No side effects Drugs invented in cancer control

హైదరాబాద్ : సూపర్‌పారామ్యాగ్నెటిక్, ఆల్బుమెన్ నానోపార్టికల్స్ క్యాన్సర్ నియంత్రణకు పనిచేయనున్నట్లు బయోమెడికల్ అడ్వాన్సెస్‌లో గుర్తింపు లభించినట్లు హెచ్‌సీయూ వర్సిటీ పీఆర్‌ఓ తెలిపారు. క్యాన్సర్ వ్యాధి నిర్మూలన ప్రక్రియలో వినియోగిస్తున్న ఔషధాలతో సైడ్ ఎఫెక్ట్‌ లు కల్గుతున్న విషయం తెలిసిందే. ఈ సైడ్ ఎఫెక్ట్‌లను నిలువరించేలా గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధనలు చేసిన ప్రతిపాదించారు. సూపర్‌పారామ్యాగ్నెటిక్, ఆల్బుమెన్ నానోపార్టికల్స్ క్యాన్సర్ నియంత్రణకు పనిచేయనున్నట్లు దీనికి బయోమెడికల్ అడ్వాన్సెస్‌లో గుర్తింపు లభించినట్లు వర్సిటీ పేర్కొంది. వర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ దిబాకర్ దాస్, నానోసైన్సెస్ అండ్ టెక్నాలజీకి చెందిన రీసెర్చ్ స్కాలర్ మహ్మద్ ఖాసీమ్, మెటీరియల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ స్కాలర్ కుసుమ ఆస్గర్, అనిమల్ బయాలజీలో పోస్టు డాక్టరేట్ ఫెలో విద్యార్థి డాక్టర్ గంగప్ప ధర్మపురిలు పరిశోధనలు జరిపినట్లు తెలిపారు.

1255
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles