కొత్త రూట్ 6RK.. రాంనగర్ టూ కాళీమందిర్

Sun,April 22, 2018 07:28 AM

new route Ramnagar to Kalimandir

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో మరో కొత్త రూట్లో బస్సును ప్రకటించారు. రాంనగర్ నుంచి కాళీమందిర్ వరకు సోమవారం నుంచి బస్సులను నడిపించనున్నారు. రాంనగర్ నుంచి బాగ్‌లింగంపల్లి, నారాయణగూడ, హిమాయత్‌నగర్, లిబర్టీ, లక్డీకాపూల్, మాసాబ్‌ట్యాంక్, మెహిదీపట్నం, లంగర్‌హౌస్, బాపుఘాట్, టిప్పుఖాన్ బ్రిడ్జి, బండ్లగూడ మీదుగా కాళీమందిర్‌కు బస్సులు చేరుకుంటాయని చెప్పారు. ఉదయం 5.35 గంటల నుంచి రాత్రి 7.56 నిమిషాల వరకు రాంనగర్ నుంచి బస్సులు నడవనున్నాయి. అదేవిధంగా కాళీమందిర్ నుంచి ఉదయం 6.50 నుంచి రాత్రి 9.11 గంటల వరకు బస్సులు నడుస్తాయని అన్నారు. బస్సులు 6RK రూట్‌నెంబర్‌తో నడుస్తాయని తెలిపారు.

4400
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles