ప్రభుత్వ పాఠశాలలకు కొత్త భవనాలు

Mon,May 13, 2019 07:17 AM

new buildings to government schools

- శిథిలావస్థకు చేరుకున్న వాటికి మోక్షం
- ఎన్నికల కోడ్ ముగియగానే పనులు
- సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామంటున్న అధికారులు

హైదరాబాద్: ఎన్నో ఏండ్లుగా నిరాధరణకు గురవుతున్న ప్రభుత్వ పాఠశాలల భవనాలకు మోక్షం లభించనుంది.. పెచ్చులూడుతున్న గోడలు.. కూలుతున్న పైకప్పుతో బిక్కుబిక్కుమంటూ చదువుకుంటున్న విద్యార్థుల కష్టాలు తీర్చేందుకు సర్వశిక్షా అభియాన్ నిధులతో కొత్త భవనాలను నిర్మించనున్నారు.

బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని బోళానగర్, ఎన్‌బీనగర్ బస్తీల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలకు కొత్త భవనాలను నిర్మించేందుకు అధికారులు కసరత్తులు ప్రారంభించారు. గత యేడాది కాలంగా బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి చేస్తున్న కృషితో ఇప్పటికే నిధులు మంజూరయ్యాయి. గత ఆరు నెలలుగా ఎన్నికల కోడ్, ఇతర కారణాలతో భవన నిర్మాణాలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ నెల 23తో ఎన్నికల కోడ్ ముగుస్తుండడంతో ఈ రెండు పాఠశాలలకు చెందిన భవనాలను నిర్మించేందుకు టెండర్లు సిద్ధం చేస్తున్నారు.

బోళానగర్‌లో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న గదుల్లోనే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కొనసాగుతోంది. మైనార్టీలు అధికంగా నివాసం ఉం టున్న ఈ బస్తీలో స్కూల్ నిర్మాణాన్ని చేపట్టాలంటూ స్థానికులు ఎన్నో ఏండ్లుగా కోరుతున్నారు. దీంతో ఏడాది క్రిత మే ఎంపీ కేశవరావు, బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రత్యేకంగా చొరవ తీసుకుని స్కూల్ భవనాన్ని నిర్మించాలని సర్వశిక్షా అభియాన్ అధికారులను కోరారు.

రూ. 33లక్షల వ్యయంతో మూడు తరగతి గదులను నిర్మించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మరిన్ని నిధులు కావాలంటే తన నిధుల నుంచి ఇస్తానని ఎంపీ కేకే తెలిపారు. రెండు రోజుల క్రితం సర్వశిక్షా అభియాన్ ఈఈ భాస్కర్‌తో సమావేశం నిర్వహించి త్వరగా టెండర్ల ప్రక్రి య పూర్తి చేయాలని, సాధ్యమైనంత త్వరగా పనులు చేపట్టాలని ఆదేశించారు. దీంతో పాటు బంజారాహిల్స్ రోడ్ నం 12లోని ఎన్‌బీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని రూ. 60 లక్షలతో నిర్మించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం ఇరుకైన రేకుల షెడ్డులో పా ఠశాల కొనసాగుతోంది. దీని స్థానంలో ఆరు గదులతో కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు నిధులు సిద్ధంగా ఉన్నాయని, మార్చి23 తర్వాత టెండర్లు పిలవనున్నామని అధికారులు తెలిపారు. ఈ రెండు పాఠశాలల నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నామని బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.

1207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles