వాన్ ఇఫ్రా అవార్డును అందుకున్న నమస్తే తెలంగాణ సీజీఎం శ్రీనివాస్

Wed,September 26, 2018 05:21 PM

Namasthe Telangana CGM Ch Srinivas conferred with WAN IFRA award in 26th annual conference

హైదరాబాద్: తెలంగాణ తొలి పత్రిక నమస్తే తెలంగాణ ప్రపంచ స్థాయి వర్ణనాణ్యత కలిగిన దినపత్రికగా వాన్ ఇఫ్రా అవార్డును గెలుచుకుంది. వాన్ ఇఫ్రా 26వ వార్షిక సమావేశం సందర్భంగా ఈ అవార్డును నమస్తే తెలంగాణ సీజీఎం సీహెచ్ శ్రీనివాస్ అందుకున్నారు. నగరంలోని హెచ్‌ఐసీసీలో వాన్ ఇఫ్రా 26వ వార్షికోత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. రేపటి వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ సహకారంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పేపర్ ప్రింటింగ్ రంగంలో ఉన్న 25 దేశాలకు చెందిన 350 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పత్రికా ముద్రణ భవిష్యత్తు, ప్రింట్ మీడియా రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల గురించి ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తున్నారు. వాటితో పాటు వరల్డ్ ఎడిటర్స్ ఫోరమ్ సౌత్ ఏషియా సదస్సు, వరల్డ్ ప్రింటర్స్ ఫోరమ్ కాన్ఫరెన్స్‌ను కూడా నిర్వహించనున్నారు.

ఈసందర్భంగా సౌత్ ఏషియా డిజిటల్ మీడియా అవార్డులను ఈ సమావేశంలో ప్రదానం చేశారు. ప్రపంచ స్థాయిలో వర్ణనాణ్యత కలిగిన దినపత్రికగా అవార్డును గెలుచుకున్న నమస్తే తెలంగాణ తరుపున సంస్థ సీజీఎం సీహెచ్ శ్రీనివాస్ ఆ అవార్డును అందుకున్నారు. అనంతరం ఆయన పత్రికా ముద్రణ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులపై సమావేశంలో ప్రసంగించారు.
1940
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles