సంగీత, నృత్య పరీక్ష ఫీజు ఫిబ్రవరి 5 వరకు చెల్లించాలి

Thu,January 10, 2019 09:59 AM

Music and dance examination fees should be paid till February 5

హైదరాబాద్ : ప్రభుత్వ సంగీత, నృత్య కాలేజీల్లో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు చేస్తున్న విద్యార్థులు వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లించాలని తెలుగు యూనివర్సిటీ పరీక్షల విభాగం నియంత్రణాధికారి ఆచార్య వై.రెడ్డి శ్యామల ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులకు సర్టిఫికెట్ కోర్సులకు రూ.1,050, డిప్లొమాకు రూ.1,300 చెల్లించాలని, ప్రైవేటు విద్యార్థులు సర్టిఫికెట్ కోర్సుకు రూ.1,050, హాజరుశాతం మినహాయింపునకు రూ.1,150, డిప్లొమా కోర్సుకు రూ.1,300, హాజరు మినహాయింపు కింద రూ.1,150 చెల్లించాలని వివరించారు. అదనపు డిసిప్లేన్ విభాగంలో ఒక్కో సబ్జెక్టుకు రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులకు సర్టిఫికెట్ కోర్సుకు రూ.750, డిప్లొమా కోర్సుకు రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులకు రూ.850 చెల్లించాలి.
అయితే అంథ విద్యార్థులకు పరీక్ష ఫీజు మినహాయింపు ఉంటుంది. ఈ ఫీజులను ఫిబ్రవరి 5 వరకు, రూ.100 లేట్ ఫీజుతో ఫిబ్రవరి 6 నుంచి 12వ తేదీ వరకు, రూ.500 లేట్ ఫీజుతో ఫిబ్రవరి 13 నుంచి 19వ తేదీ వరకు చెల్లించాలని వివరించారు. దరఖాస్తును యూనివర్సిటీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని నిర్ణీత ఫీజు డీడీతో పరీక్ష రాసే కాలేజీలో సమర్పించాలని పేర్కొన్నారు.

514
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles