టిఆర్ఎస్‌కే మా మ‌ద్ధ‌తు.. మున్నూరు కాపు సంఘం నేత‌లు

Mon,September 17, 2018 09:37 PM

Munnuru Kapu leaders   meets TRS MP K Kavitha in hyd

హైద‌రాబాద్: తెలంగాణ స‌మ‌గ్రాభివృద్ధి, ప్ర‌జాసంక్షేమం కోసం ఉద్య‌మంలా ప‌నిచేస్తున్న టిఆర్ఎస్ పార్టీకే మా మ‌ద్ధ‌తు ఉంటుంద‌ని నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల కవిత‌కు తెలంగాణ మున్నూరు కాపు మ‌హాస‌భ నేత‌లు హామీ ఇచ్చారు. సోమ‌వారం తెలంగాణ మున్నూరు కాపు మ‌హాస‌భ అధ్య‌క్షులు డాక్ట‌ర్ కొండ దేవ‌య్య ఆధ్వ‌ర్యంలో 31 జిల్లాల బాధ్యులు హైద‌రాబాద్‌లో ఎంపీ క‌విత‌ను ఆమె నివాసంలో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న‌ ఎన్నిక‌ల్లో టిఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకుంటామ‌న్నారు. అన్ని కులాలు గౌర‌వ‌ప్ర‌ద‌మైన జీవ‌నం గ‌డిపేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణ‌యాలు ప్ర‌జామోదం పొందుతున్నాయ‌న్నారు. అన్ని కుల సంఘాల‌కూ ఇచ్చిన‌ట్లే మున్నూరు కాపుల‌కూ కోకాపేట్‌లో 5 ఎక‌రాల భూమిని కేటాయించి, రూ. 5 కోట్ల‌ను కేసీఆర్‌ మంజూరు చేశార‌ని క‌విత‌కు వివ‌రించారు.

56 శాతం బీసీల్లో 112 కులాలు ఉండ‌గా 18 శాతం మంది మున్నూరు కాపులున్నారని వారు వివ‌రించారు. పొరుగు రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాపుల‌కు కార్పోరేష‌న్ ఏర్పాటు చేశార‌ని, అలాగే మ‌న రాష్ట్రంలోనూ మున్నూరు కాపుల‌కు ప్ర‌త్యేక కార్పోరేష‌న్ ఏర్పాటు చేస్తే మున్నూరు కాపుల అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. మున్నూరు కాపుల స‌మ‌స్య‌ల‌ను సీఎం దృష్టికి తీసుకువెళ‌తాన‌ని క‌విత హామీ ఇచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ మున్నూరు కాపు మ‌హాస‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ పుఠం పురుషోత్తం, గంగాధ‌ర న‌ర్సింగ‌రావు, ప్యాట నంద‌కిశోర్‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ అధ్య‌క్షులు ఆర్‌.వి మ‌హేంద‌ర్ కుమార్‌, మ‌హిళా అధ్య‌క్షురాలు అల్లాడి గీతారాణి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బండి ప‌ద్మ‌, వ‌ర్కింగ్ ప్రెసిండెంట్ తాడెం రంజిత‌, మ‌ధువాణి పాల్గొన్నారు.

2079
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS