రేవంత్ రెడ్డి అన్నం తింటున్నాడా.. గడ్డి తింటున్నాడా?: సుమన్

Sat,August 11, 2018 07:15 PM

MP Suman fires on congress in TRSLP meeting

హైదరాబాద్: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఎటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడితే ఊరుకునేది లేదని ఎంపీ బాల్క సుమన్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి అన్నం తింటున్నాడా... లేక గడ్డి తింటున్నాడా..? అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ విషపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నదన్న సుమన్.. కాంగ్రెస్ నేతలు నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు డ్రామాలు బంద్ చేయాలని.. వాళ్లు బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. టీడీపీ ముందు కాంగ్రెస్ మోకరిల్లిందని ఎంపీ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎంపీ సుమన్ మీడియాతో మాట్లాడారు.

టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలే హైకమాండ్ అన్న సుమన్.. తెలంగాణ రాష్ట్ర సమితి సెక్యులర్ పార్టీ అన్నారు. సీఎం కేసీఆర్ ఎప్పుడూ ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పలేదన్నారు. రాహుల్ గాంధీ ఎక్కడికెళ్తే తమకేంటన్న సుమన్.. ఉస్మానియా యూనివర్సిటీ అటానమస్ బాడీ అని.. యూనివర్సిటీ విషయాల్లో వీసీ నిర్ణయం తీసుకుంటారన్నారు. రాహుల్ గాంధీ ఎంత సరుకున్న నేతో మొన్న పార్లమెంట్‌లోనే తెలిసిందని సుమన్ ఎద్దేవా చేశారు. గాంధీభవన్ గోబెల్స్ భవన్‌గా మారిపోయిందని వ్యాఖ్యానించారు.

9760
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS