కేటీఆర్‌ను కలిసిన ఎంపీలు, రెడ్డి సామాజిక వర్గం నేత‌లు

Sat,October 20, 2018 02:16 PM

MP Malla Reddy meets ktr over reddy corporation Announcement

హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని టీఆర్‌ఎస్ పార్టీ హామీ ఇవ్వడంపై రెడ్డి సామాజిక వర్గం నేతలు హర్షం వ్యక్తం చేశారు. శనివారం బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ను కలిసి రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దసరా పండుగ శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మ‌ల్లారెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి, ప్రజాప్రతినిధులు చంద్రారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, హరిమోహన్‌రెడ్డి, భాగ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శుక్ర‌వారం రెడ్డి జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ నేత‌లు కేటీఆర్‌ను క‌లిసి ధ‌న్య‌వాదాలు చెప్పిన విష‌యం తెలిసిందే.

4034
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles