అమృత్‌సర్ ఘటనపై ఎంపీ కవిత దిగ్భ్రాంతి

Mon,November 19, 2018 11:37 AM

mp kavitha condolences to those who lost their lives in Adliwal

హైద‌రాబాద్: అమృత్‌స‌ర్ ఘ‌ట‌న‌పై ఎంపీ క‌విత తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలకు ట్విటర్‌లో ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. శాంతిభద్రతలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిఘా సంస్థలు మరింత దృష్టిసారించాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి దురదృష్టకర ఘటనలు మున్ముందు జరగకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మ‌న దేశ అంతర్గత భద్రత, శాంతిని నెల‌కొల్పే దిశ‌గా కృషి చేయాల‌న్నారు. అమృత్‌స‌ర్ స‌మీపంలో రాజాసాన్సీ ప్రాంతంలో ఉన్న అద్లివాల్ గ్రామంలోని నిరంకారి ఆధ్యాత్మిక మందిరం వద్ద ఈ పేలుడు చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. గ్రెనేడ్ దాడిలో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20మందికి పైగా గాయపడ్డారు.


940
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles