ఆడ శిశువని... వదిలివెళ్లిన తల్లి

Sat,November 17, 2018 07:09 AM

mother leave her girl baby in gandhi hospital hyderabad

హైదరాబాద్ : నవమాసాలు మోసి పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చిన తల్లి.. ఆ శిశువును దవాఖానలో వదిలి వెళ్లింది. ఈసంఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ దవాఖానలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం. .గచ్చిబౌలికి చెందిన గోమతి (25) నిండు గర్భిణి. ప్రసూతి నిమిత్తం ఈనెల 7న గాంధీ దవాఖాన లేబర్‌వార్డులో చేరింది. అదే రోజు పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న తల్లిబిడ్డలను గైనకాలజీ వార్డులోకి తరలించారు.

వార్డులోని బెడ్‌పై శిశువును ఉంచి తల్లి గోమతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తుండగా సిబ్బంది గమనించి తల్లి బాత్‌రూంకు వెళ్లి ఉంటుందని భావించారు. ఎంత సేపటికి రాకపోవడంతో అనుమానం వచ్చి ఆరా తీయగా శిశువును వదిలేసి తల్లి వెళ్లి పోయినట్లు తేలింది. గాంధీ దవాఖాన అధికారుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లేబర్‌వార్డులోని రిజిస్టర్‌లో తల్లి గోమతి,తండ్రి శుక్లా, గచ్చిబౌలి అని మాత్రమే ఉందని, శిశువును దవాఖానలో ఉంచి సంరక్షిస్తున్నామని ఎస్‌ఐ రాజునాయక్ తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

3352
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS