'బీసీ' రుణాలకు దరఖాస్తుల వెల్లువ

Wed,June 13, 2018 11:30 AM

More applications to bc loans hyderabad

హైదరాబాద్: సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో బీసీ కార్పొరేషన్ రుణాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. సికింద్రాబాద్, బేగంపేట సర్కిళ్లకు చెందిన దరఖాస్తుదారుల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం జరిగింది. రుణాల కోసం అనూహ్య స్పందన రావడంతో అధికారులు అప్పటికప్పుడు అవసరమైన ఏర్పాట్లు చేయలేకపోయారు. దీంతో దరఖాస్తు దారులు ఇబ్బందులకు గురయ్యారు. బ్యాంకుల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని బ్యాంకులకు సంబంధించిన సిబ్బంది రాకపోవడంతో దరఖాస్తుదారులు పలు ఇబ్బందులు పడ్డారు. క్యూలైన్‌లో దరఖాస్తుదారులు సర్టిఫికెట్ల వేరిఫికేషన్ కోసం ఎగబడటంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి చక్కదిద్దారు. యూసీడీ విభాగం అధికారి తిరుపతయ్య చాలా సేపు దరఖాస్తుదారులను సముదాయించాల్సిన పరిస్థితి నెలకొంది.

దరఖాస్తుల పరిశీలన..


మార్చి 24న బీసీ కార్పొరేషన్ రుణాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఏప్రిల్ 21 వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించారు. బ్యాంక్ రుణాలకు సంబంధించి 656 మంది, బ్యాంక్ యేతరలకు సంబంధించి 383 మంది దరఖాస్తులు చేసుకున్నారు. కాగా వీరి దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించేందుకు.. జీహెచ్‌ఎంసీ, బీసీ కా ర్పొరేషన్, పలు బ్యాంక్‌ల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ సర్కిల్ ఉప కమిషనర్ రవికుమార్, బేగంపేట సర్కిల్ ఉప కమిషనర్ శైలజ, బీసీ కార్పొరేషన్ అసిస్టెంట్ వెల్ఫేర్ అధికారిణి ఇందిర, మంజుల, రాధ, యూసీడీ అధికారి తిరుపతయ్య, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.

2632
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles