సెల్‌టవర్ ఆశ చూపి...

Tue,January 8, 2019 07:16 AM

Mobile Tower Fraud in parigi

హైదరాబాద్ : ఊరికి 4 జి కమ్యూనికేషన్ సేవలను అందుబాటులోకి తెద్దామనుకుని..ఓ భవన నిర్మాణ కాంట్రాక్టర్ రూ.6.52 లక్షలను పోగట్టుకున్నాడు. చివరకు మోసపోయానని గ్రహించి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పరిగి ప్రాంతానికి చెందిన ప్రేమ్‌కుమార్ ఇటీవల ఓ పేరొందిన ప్రతికలో ఓ సెల్ టవర్ ఏర్పాటుకు సంబంధించి ప్రకటనను చూశాడు. అందులో ఉన్న ఫోన్ నంబర్‌ను సంప్రదిందచగా.. అవతలి వ్యక్తి నెలకు రూ.30 వేల అద్దె, అడ్వాన్స్ కింద రూ.5 లక్షలు... ఇలా బంపర్ ఆఫర్‌లు ఇచ్చాడు. టవర్ ఏర్పాటు నెలలో పూర్తైయ్యి... ఆ తరువాత నెల నుంచే మీకు ఆదాయం వస్తుంది... ఈ ఒప్పందం దాదాపు 5 సంవత్సరాల వరకు ఉంటుందని నమ్మించాడు. మీరు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు... మీకు స్థలం ఉంటే చాలు.. మా కంపెనీ ఆ ప్రాంతంలోనే టవర్ ఏర్పాటు చేస్తది.

ఈ మాటలు విన్న ప్రేమ్‌కుమార్ ఊర్లో కూడా సిగ్నల్స్ సరిగ్గా లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారని... ఈ సెల్‌టవర్ ఏర్పాటుకు స్థలాన్ని ఇస్తే గ్రామంలో సమాచార వ్యవస్థ మెరుగుపడడంతో పాటు 4జీ సిమ్‌లు వేగవంతంగా పనిచేస్తాయని, తనకు కూడా ఆదాయం వస్తుందనుకున్నాడు. వెంటనే తన స్థలంలో టవర్ ఏర్పాటుకు ఒకే అన్నాడు. అంతే ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి .. మీ స్థలంలో సర్వే చేయాలి, రిజిస్ట్రేషన్ డిపాజిట్ కట్టాలి, ఇవన్నీ తిరిగి మీకు ఒప్పందం సంతకం చేసుకునే రోజు వాపసు వస్తాయని నమ్మించాడు. మీరు రిజిస్ట్రేషన్ డిపాజిట్ కట్టగానే... మా సిబ్బం ది మీ వద్దకు వచ్చి సంప్రదిస్తారు... ఆ వెంటనే టవర్ ఏర్పాటుతో పాటు మీకు ఆదాయం షురు అవుతుందని చెప్పాడు. ఈ మాటలను నమ్మిన ప్రేమ్‌కుమార్ వివిధ దశల్లో మొత్తం రూ.6.52 లక్షలను ఆన్‌లైన్‌లో చెల్లించాడు. నగదును డిపాజిట్ చేసిన తర్వాత దాదాపు నెలరోజులు గడుస్తున్నా అతనికి ఎలాంటి సమాచారం లేకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక ఫిర్యాదును పరిశీలించిన సైబర్ క్రైం పోలీసులు ఇది ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన సైబర్ ముఠా పనేనని అనుమానిస్తున్నారు.

తాజాగా... దేశవ్యాప్తంగా 4జీ సిమ్‌లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని సైబర్ ముఠాలు జియో టవర్‌ల ఏర్పాటు అంటూ బురిడీ కొట్టించేందుకు అమాయకులకు గాలం వేస్తున్నారని సైబరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ తెలిపారు. ఇలాంటి ప్రకటనలకు ప్రజలు బోల్తా పడొద్దని, ప్రకటనలపై సంప్రదించినా... ఆ సంస్థలు, కార్యాలయాలు, సిబ్బందిని నేరుగా కలువాలి... ఫోన్‌లలో చెప్పే మాటలను నమ్మి నగదును డిపాజిట్ చేయొ ద్దు.... మీరు కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఇతర రాష్ట్రాలకు పిలిచే ప్రాంతాలకు వెళ్లవద్దని ఏసీపీ సూచించారు.

1912
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles