20 వేల మందికి భోజన ఏర్పాట్లు

Mon,September 3, 2018 09:42 AM

MLA Maganti gopinath arranged food for 20 thousand people from jubilee hills constituency

హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లనుంచి ప్రగతి నివేదనకు తరలివెళ్లిన గులాబీ శ్రేణులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సుమారు 20వేలమందికి పైగా సభకు తరలివెళ్లడంతో వారందరికీ భోజనం ప్యాకెట్లను తయారు చేయించారు. జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంవద్ద వందలాది మంది వంటవాళ్లు, వర్కర్ల సాయంతో బిర్యానీ తయారు చేయించిన ఎమ్మెల్యే మాగంటి ఆయా డివిజన్లలో నుంచి బయలుదేరే బస్సుల్లో అప్పగించేలా చర్యలు తీసుకున్నారు. మంచినీటి ప్యాకెట్లు, వాటర్‌బాటిళ్లు, పండ్లు ఇతర ఆహారపదార్ధాలను కూడా సభకు వెళ్లేవారికి అందజేశారు. సభకు వెళ్లేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు భోజన సదుపాయాన్ని కల్పించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

6251
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS