నూతన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

Mon,June 17, 2019 11:21 AM

mla and mlc quarters inaugurated by cm kcr

హైదరాబాద్: శాసనసభ, శాసనమండలి సభ్యుల కోసం నగరంలోని హైదర్‌గూడలో నిర్మించిన నివాస సముదాయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో స్పీకర్, మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ క్వార్టర్స్ ను సీఎం కేసీఆర్ పరిశీలించారు.

120 మంది చట్టసభల ప్రజాప్రతినిధులు నివాసం ఉండేలా 4.26 ఎకరాల స్థలంలో రూ.166 కోట్లతో నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఫ్లోర్‌లో పదిచొప్పున 12 అంతస్తుల్లో 120 క్వార్టర్స్‌ను నిర్మించారు. ఒక్కోక్వార్టర్‌ను మూడు బెడ్‌రూంలతో 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంతో.. మొత్తం 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణం చేపట్టారు. వీటికి అనుబంధంగా 325 చదరపు అడుగుల చొప్పున 120 సర్వెంట్ క్వార్టర్స్‌ను, సిబ్బందికి 36 క్వార్టర్స్ ఉన్నాయి. ఒక్కో సభ్యుడికి రెండుకార్లకు అవసరమైన పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో 23 సమావేశ క్యాబిన్లను కూడా ఏర్పాటుచేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలను కలువడానికి వీలుగా వీటిని నిర్మించారు.

2660
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles