ఒక్క డెంగ్యూ కేసు కూడా నమోదు కావడానికి వీల్లేదు!

Sat,September 14, 2019 12:14 PM

Minister Srinivas Goud Inspects Mahabubnagar town roadside areas

మహబూబ్ నగర్: జిల్లా కేంద్రాన్ని డెంగ్యూ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చర్యలు వేగవంతం చేశారు. శనివారం కలెక్టర్ రోనాల్డ్ రోస్ తో కలిసి జిల్లా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందికి డెంగ్యూ నివారణకు చేపట్టాల్సిన చర్యల పై మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో డెంగ్యూ నివారణ చర్యలకు కదిలిన సిబ్బంది ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

మున్సిపల్ సిబ్బంది వారం రోజుల్లో పట్టణం మొత్తం డెంగ్యూ పై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. ఏ ఇంటి దగ్గర అయినా నిర్లక్ష్యంగా నీటి నిల్వలు ఉండి ఉంటే అలాంటి వాటిని పారబోయలని సూచించారు. తడి పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని పట్టణ వాసులకు పదే పదే గుర్తు చేయాలన్నారు. డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందే విధానాన్ని ఇంటింటికి వెళ్లి వివరించి డెంగీ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించే కరపత్రాన్ని ఇంటి తలుపు కు అంటించాలన్నారు. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలోనే అత్యధికంగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి చెత్త సేకరణ వాహనాలను తీసుకువచ్చామని వాటిని పూర్తిస్థాయిలో వినియోగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

వారం రోజుల తర్వాత ఒక్క డెంగ్యూ కేసు కూడా నమోదు కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. డెంగ్యూ వ్యాధి నివారణ ప్రభుత్వ బాధ్యత ఒక్కటే కాదని పౌరులు కూడా ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా భావించి డెంగ్యూ నివారణలో కలిసి రావాలన్నారు. అనంతరం ఆయన మున్సిపల్ కార్యాలయం నుండి అశోక్ టాకీస్ చౌరస్తా వరకు పారిశుద్ధ్య చర్యలు పరిశీలించారు. రహదారులపై నిల్వ ఉన్న నీటిలో స్వయంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ దోమల నివారణ మందు స్ప్రే చేశారు.

688
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles