గిరిజన శాఖలో విద్యకు అత్యంత ప్రాధాన్యత: మంత్రి సత్యవతి

Tue,October 22, 2019 07:33 PM

హైదరాబాద్‌: గిరిజనశాఖ అధికారులు, సిబ్బందికి సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజన శాఖ ఉపాధ్యాయులు రూపొందించిన రెండు అభ్యాసిక పుస్తకాలను, ఉపాధ్యాయుల కరదీపికలను తెలంగాణ లైఫ్‌ైస్టెల్‌పై రూపొందించిన డాక్యుమెంటరీలను మంత్రి సత్యవతి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..'గిరిజనులకు శిక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.2.5కోట్లు కేటాయించి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. గిరిజనులకు మరింత మేలు చేసేందుకు సూచనలు చేసి శాఖ పనితీరును అభినందించిన గవర్నర్‌ తమిళిసైకి ధన్యవాదాలు. గిరిజన శాఖలో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు, లబ్ధిదారులకు మరింత చేరువయ్యేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలి. ఎప్పటికప్పుడు అధికారులు, సిబ్బంది నైపుణ్యాలను శిక్షణ కార్యక్రమాల ద్వారా పెంచుకోవాలి. సీఎం కేసీఆర్‌ ఆశయం మేరకు బంగారు తెలంగాణ సాధనలో భాగస్వామ్యం కావాలి. గిరిజన శాఖలో కూడా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని' పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బెన్హర్‌ దత్‌ ఎక్కా, కమిషనర్‌ క్రిస్టినా, గిరిజన విద్యాలయాల ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.

636
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles