సర్‌ మీరు అమ్మాయిలకు రిప్లై ఇవ్వట్లేదు:కేటీఆర్‌ను అడిగిన నెటిజ‌న్‌

Sun,July 15, 2018 03:50 PM

Minister KTR Chit Chat With  followers in twitter

హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విటర్‌లో నెటిజన్లతో సరదాగా ముచ్చటించారు. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉండే కేటీఆర్‌ను ఫాలోకావడంతో పాటు ఆయనను యువత ఆదర్శంగా తీసుకుంటోంది. ఆస్క్ కేటీఆర్ యాష్‌ట్యాగ్‌తో (#AskKTR) ఆయనకు ట్యాగ్ చేస్తూ.. అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. రాజకీయ, వ్యక్తిగత, సామాజిక అంశాలపై అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్‌లో జవాబిచ్చారు.

మీకు ఇష్టమైన క్రికెటర్‌ ఎవరు? ధోనీ లేక‌ కోహ్లీనా?

కేటీఆర్‌: రాహుల్ ద్ర‌విడ్‌, సచిన్ టెండూల్క‌ర్‌. నేను వారి జ‌న‌రేష‌న్‌ నుంచే వచ్చాను.

మీ ఫేవ‌రెట్ ఫుట్‌బాల‌ర్‌?

కేటీఆర్‌: మెస్సీ

భారత యువత గురించి ఒక్కమాటలో చెప్పండి సర్‌?

కేటీఆర్‌: పవర్‌ ఆఫ్‌ ఇండియా

ఈజీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ అగ్ర‌స్థానంలో ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?

కేటీఆర్‌: అందుకు ఏపీకి శుభాకాంక్షలు. మేం 0.09 శాతంతో మాత్ర‌మే వెన‌క‌బ‌డ్డాం.

నేను లా చదువుతున్నాను. మీ ఆధ్వర్యంలో ఇంటర్న్‌షిప్‌ చేయాలనుకుంటున్నాను. దరఖాస్తు పత్రాలు కూడా పంపించాను. నన్ను తీసుకుంటారా?

కేటీఆర్‌: ఒక లా విద్యార్థి నా వద్ద ఏం ఇంటర్న్‌షిప్‌ చేస్తాడో నాకు తెలియ‌దు. దరఖాస్తు పత్రాలను పరిశీలించమని నా టీమ్‌కు చెప్తాను.

నిజాం కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు కదా? మీకెలా అనిపిస్తోంది?

కేటీఆర్‌: నిజాం గొప్ప‌ కాలేజ్‌

నగర బహిష్కరణలపై మీ అభిప్రాయం ఏంటి?

కేటీఆర్‌: లా అండ్‌ ఆర్డర్‌ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు.

ఒక రాజకీయ నేతగా మీరు సాధించిన గొప్ప విషయాల గురించి చెప్తారా?

కేటీఆర్‌: నేను రిటైర్ అయిన త‌రువాత చెప్తాను

మీకు నచ్చిన బీర్‌ ఏది?

కేటీఆర్‌: ఆ విషయం చెప్పను

2019 ఎన్నికల్లో ఉమ్మ‌డి నల్లొండ జిల్లా నుంచి ఎన్ని సీట్లు వస్తాయని ఆశిస్తున్నారు?

కేటీఆర్‌: మొత్తం 12 గెలుస్తామ‌ని ఆశిస్తున్నాను.

జమిలి ఎన్నికలపై మీ అభిప్రాయం చెప్పండి?

కేటీఆర్‌: స్వాగతిస్తున్నాను.

మీకు నచ్చిన క‌మెడియ‌న్‌?

కేటీఆర్‌: రాజకీయల్లో అడుతున్నావు కదా (నవ్వుతూ)

ముఖ్యమంత్రుల్లో వైఎస్సార్ గొప్పా? కేసీఆర్‌ గొప్పా?

కేటీఆర్‌: సమాధానం మీకే బాగా తెలుసు.

మనం ఎంత గొప్ప స్థానంలో ఉన్నా..ఎలా ఒదిగి ఉండాలో సలహా ఇవ్వగ‌ల‌రా?

కేటీఆర్‌: ఈ స్థానాలు శాశ్వతం కాదు. రెప్ప‌పాటులో మాయమైపోతాయి.

2019 ఎన్నికల్లో జూబ్లీహిల్స్, శేర్‌లింగంప‌ల్లి నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారా?

కేటీఆర్‌: సిరిసిల్ల ప్రజలు నన్ను మూడుసార్లు గెలిపించారు. వారి నమ్మకానికి కట్టుబడి ఉంటాను.

సర్‌ మీరు అమ్మాయిలకు రిప్లై ఇవ్వట్లేదు

కేటీఆర్‌: నాకంత ధైర్యం ఉందా?

తర్వాతి తెలంగాణ సీఎం ఎవరు?

కేటీఆర్‌: కేసీఆర్‌

డిసెంబర్‌లోగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని మీకు అనిపిస్తోందా? అందుకు సిద్ధంగా ఉన్నారా?

కేటీఆర్‌: అవి ఎప్పుడు జరిగినా మేం సిద్ధంగానే ఉన్నాం.

2024లో జరిగే ఎన్నికల్లో మీరు ఏపీ నుంచి పోటీచేయాలని నాలాంటి చాలా మంది యువకులు కోరుకుంటున్నారు. మీరేమంటారు?

కేటీఆర్‌: భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు.

4488
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles