వారసత్వం ఇస్తే వచ్చేది కాదు!

Fri,October 5, 2018 08:00 PM

minister jagadish reddy showered praises on Minister KTR

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మంత్రి కేటీఆర్ భాగస్వామ్యం కీలకమని మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. వారసత్వం ఇస్తే వచ్చేది కాదని.. ఆస్తి మాత్రమే వారసత్వంగా వస్తుందని తెలిపారు. ఆ ఆస్తి కూడ దక్షత లేకుంటే హారతి కర్పూరంలా కరిగిపోతుందని పేర్కొన్నారు. చాలా మంది నాయకుల వారసులు దక్షత లేకపోవడంతో ఎక్కువ కాలం నిలబడలేకపోయారని అన్నారు. స్వయంకృషితో ఉద్యమంలో భాగస్వామ్యం అయినందునే కేటీఆర్ ఆమోదయోగ్యుడయ్యారని వివరించారు. సిరిసిల్ల పట్టణ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశానికి హాజరైన సందర్భంగా జగదీష్‌రెడ్డి మాట్లాడారు.

కేటీఆర్‌లాంటి నాయకుడు దొరకడం సిరిసిల్ల ప్రజల అదృష్టం అని మంత్రి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అటు ఐటీ..ఇటు పరిశ్రమల శాఖ మంత్రి అంటే ఏంటో తెలిసేది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పరిశ్రమలు అంటే గుర్తుకు వచ్చేది గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలే. ఇప్పుడు కేటీఆర్ ఆయా శాఖలకు మంత్రిగా ఉండడంతో కొత్తగా ఏర్పడ్డప్పటికీ తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో చేరింది. రాష్ర్టాల పునర్విభజన తర్వాత ఏర్పడ్డ కొత్త రాష్ర్టాలు ఏవీ ప్రాచుర్యంలోకి రాలేకపోయాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ఇప్పుడు యావత్ ప్రపంచానికి తెలంగాణ రాష్ట్రం తెలిసిపోయింది. కేటీఆర్ చేనేత,జౌళిశాఖ మంత్రిగా ఉండటం వల్లే నేతన్నల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. అటువంటి నాయకుడిని ఒక్క సిరిసిల్లకే పరిమితం చేయకూడదు. ఎన్నికల ప్రచారంలో ఆయన సేవలు మొత్తం తెలంగాణ రాష్ర్టానికి అవసరం. యావత్ రాష్ర్టానికి సేవలు అందించే నాయకుడు సిరిసిల్లకు ప్రాతినిధ్యం వహించడం అదృష్టంగా భావించాలని అన్నారు.

2567
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles