ఫోన్ కొట్టు.. బిందెలో నీళ్లు పట్టు

Sun,May 19, 2019 12:05 PM

mini water tanker free for borabanda division

హైదరాబాద్: బోరబండ డివిజన్ వాసులకు ఇదొక శుభవార్త. నల్లా నీళ్లు రావటం ఆలస్యమైందా..? కనీసం తాగటానికి గుక్కెడు నీళ్లు కూడా ఇంట్లో అందుబాటులో లేవా..? అయినా ఆందోళన చెందకండి. ఒక్క ఫోన్ కొడితే మీ ఇంటి ముందు మినీ వాటర్ ట్యాంకర్ వచ్చి వాలుతుంది. రూపాయి కూడా చెల్లించకుండానే తాగునీటి అవసరాన్ని బట్టి 1-2 బిందెల నీళ్లను ఉచితంగా తీసుకోవచ్చు.

బోరబండ డివిజన్‌లోని ప్రజలకు తాగునీటి విషయ మై ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేయాలన్న ఆలోచన డిప్యూటీమేయర్ బాబా ఫసియుద్దీన్ మదిలో మెదిలింది. ఆ ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టారు. మినీ ట్యాంకర్‌ను తయారు చేయించి ఆటో ట్రాలీకి అటాచ్ చేయించారు. ఈ మొబైల్ మినీ ట్యాంకర్‌ను డిప్యూటీమేయర్ సతీమణి ప్రారంభించారు.

కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, కార్యదర్శి జి.ముత్యాలు, నేతలు సీహెచ్ కవిత, దేవమణి, పద్మ, ఎండీ యూసుఫ్, విద్యావతి, రమేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అర్జంటుగా తాగునీటి సౌలభ్యాన్ని పొందటానికి ఈ ట్యాంకర్ కోసం ఫోన్.. 040-23830666, 9573826801 నెంబర్లకు సంప్రదించవచ్చు. కాగా ఈ తాగునీటిని డివిజన్‌లోని ఎస్సార్టీనగర్‌లో ఉన్న ఆర్వో వాటర్ ప్లాట్ నుంచి సేకరిస్తున్నారు.

1266
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles